
క్రెడిట్ కార్డులు వాడేవారికి బ్యాంకులు బిగ్ షాకిచ్చాయి. క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఇస్తున్న ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్స్‌లో కోత విధించాయి. కార్డులపై ఇస్తున్న వివిధ బెనిఫిట్స్‌ను భారీగా తగ్గించేశాయి. వీటి కోసమే చాలామంది క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాటిల్లో కోతలు విధించడంతో కస్టమర్లు నిరాశ చెందుతున్నారు.

ప్రముఖ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై అందిస్తున్న వివిధ ఆఫర్లను కట్ చేశాయి. గత ఏడాది నంచి కొన్నింటిని తొలగించేస్తున్నాయి. సినిమా టికెట్లపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్లు, తగ్గింపులను కొన్ని బ్యాంకులు పూర్తిగా నిలిపివేశాయి. ఇక ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రివార్డ్ పాయింట్స్‌ను తగ్గించేశాయి.

ఎస్బీఐ గతంలో 5 పాపులర్ కార్డులపై ఏడాదికి 8 సార్లు ఫ్రీ డొమెస్టిక్ లాంజ్ సౌకర్యాలు అందించగా.. ఇప్పుడు దానికి 4కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ తన ప్లాటినమ్ కార్డులపై ఇచ్చే బుక్ మై షో టికెట్స్ బెనిఫిట్స్‌ను పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక రివార్డ్ పాయింట్స్ పరిమితిని కూడా తగ్గించింది.

నెలకు రూ.20 వేలకు మించి ట్రాన్సాక్షన్లు చేస్తే రివార్డ్ పాయింట్లు రావు. రూ.20 వేలలోపు లావాదేవీలు చేస్తేనే రివార్డ్ పాయింట్స్ పొందే సౌకర్యం ఉంటుంది. ఇక యాక్సెస్ బ్యాంక్ స్విచ్డ్ రివార్డ్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 30 రోజులకు పాయింట్స్ ఎక్స్‌పైర్ అవుతాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్పినియా క్రెడిట్ కార్డులపై రికార్డ్ పాయింట్లను తగ్గించింది.

గత ఇన్పినియా కార్డులపై ప్రతీ రూ.150 ఖర్చుకు స్టార్ బై వోచర్ పాయింట్లు 25X ఇచ్చేది. ఇప్పుడు దానిని 12Xకు తగ్గించింది. ఇక ఫెడరల్ బ్యాంక్ ఫ్రీ లాంజ్ యాక్సెస్ కోసం నెలవారీ స్పెండింగ్‌ను రూ.20 వేలక పెంచింది.