Home Loan: హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్.. ఈ టిప్స్ పాటిస్తే అప్పు ముప్పు లేని ఇల్లు మీ సొంతం

|

Jul 28, 2024 | 6:45 PM

సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన చిరకాల కోరిక. ఈ కోరికను నెరవేర్చుకునేందుకు ప్రతి నెలా పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ఆ పొదుపు నిర్ణీత మొత్తంలో జమ అయ్యాక హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో చేసే చిన్నపాటి తప్పుల వల్ల ఏళ్ల తరబడి హోమ్ లోన్ ఖాతాదారులు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అప్పుల బాధ లేకుండా తక్కువ సమయంలో సొంతింటి కలను నెరవేర్చుకునేలా నిపుణులు కొన్ని టిప్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలను ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
గృహ రుణం తీసుకున్నాక ఏటా ఈఎంఐ వాటాను పెంచితే ఏళ్ల తరబడి అప్పుల బాధ లేకుండా ఓ పదేళ్లల్లోనే బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాయితే మొత్తాన్ని ఏటా 10 శాతం పెంచితే పదేళ్లల్లోనే గృహ రుణం తీరిపోతుందని వివరిస్తున్నారు.

2 / 5
హోమ్‌లోన్ తీసుకునే వ్యక్తి తన సంపాదనలో 50 శాతానికి మించి ఈఎంఐ భారం లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈఎంఐలను చెల్లిస్తే జరిమానా బారిన పడకుండా ఉంటారని వివరిస్తున్నారు.

3 / 5
ఏటా నెలవారీ వాయిదాను ఐదు శాతం పెంచితే 13 ఏళ్లల్లో హోమ్‌లోన్ ఇబ్బంది నుంచి బయటపడవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అసలుతో పాటు వడ్డీ బాధ నుంచి త్వరగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.

4 / 5
ప్రతి ఏడాది ఒక ఈఎంఐను అధికంగా చెల్లిస్తుంటే 25 ఏళ్ల వ్యవధితో ఉన్న రుణం కేవలం 20 ఏళ్లకే తీరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచినా పెద్దగా ఇబ్బంది ఉండదని వివరిస్తున్నారు.

5 / 5
ఏదైనా బ్యాంకులు వడ్డీ తక్కువకు అందిస్తుంటే ఆయా బ్యాంకులక రుణాన్ని బదిలీ చేస్తే త్వరితగతిన రుణం తీర్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా వడ్డీ రేటుతో పాటు ఇతర ఖర్చులను పరిశీలించి రుణ బదిలీ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు.