- Telugu News Photo Gallery Break Fast healthy tips: Eat These 7 Fruits For Good Health In Empty Stomach
Health Tips: మంచి ఆరోగ్యం కోసం ఉదయం అల్పాహారంగా ఈ ఖాళీ కడుపుతో ఈ పండ్లను తీసుకోండి..
మన పెద్దలు ఆహారం తినే విధానంతో శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో 90ఏళ్లలో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేవారు.. ఉదయం అల్పాహారంతో జీవితాన్ని ప్రారంభించేవారు. అయితే ఉదయం పూట అల్పాహారానికి బదులు తినదగిన పండ్లు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినే ఆహారంలో చేర్చుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇవి మన అవయవాలకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. అయితే ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
Updated on: Jan 25, 2024 | 1:17 PM

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను అల్పాహారంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండటానికి.. మరింత శక్తిని కలిగి ఉండటానికి సహాయపడతాయి. అటువంటి పండ్లు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

పుచ్చకాయ. దీనిని తినడం వలన లోపలి నుండి మిమ్మల్ని చల్లబరుస్తుంది. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. కనుక సుదీర్ఘంగా తినకుండా ఉన్న తర్వాత శరీరానికి పుష్కలంగా తేమను అందిస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. పుచ్చకాయతో మీ రోజును ప్రారంభించడం వల్ల శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.

బొప్పాయి: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే బొప్పాయి పండును ఉదయం ఖాళీ కడుపుతో తినండి. బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగకుండా చేస్తుంది. బొప్పాయి పపైన్ , చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లతో కూడిన ఉష్ణమండల పండు. ఈ ఎంజైమ్‌లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

పైనాపిల్: దీనిలో విటమిన్ సి , మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఈ ఉష్ణమండల పండు రోగనిరోధక వ్యవస్థకు సూపర్ హీరో వంటిది. పైనాపిల్ ఆకలిగా ఉన్నప్పుడు తినడానికి బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలోని పోషకాలు శరీరంలో బాగా శోషించబడతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. పైనాపిల్ శరీరంలోని రక్షణ విధానాలను బలోపేతం చేయడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాపిల్: రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్‌కి దూరంగా ఉంచవచ్చు. యాపిల్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. మెదడు పనితీరుతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాపిల్స్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

పియర్స్: దీనిలో విటమిన్ సి , కె లతో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఈ పండు ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు, ప్రేగులు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బేరిపండ్లు జీర్ణశక్తిని పెంచుతాయి.

కివి: ఈ పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లతో నిండి ఉంటాయి. రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. కివి పండు రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ కూడా ఉంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కివీ పండును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెరిసే చర్మాన్ని ఇస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

అరటిపండు: పేదవాడి పండుగా ఖ్యాతిగాంచిన అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి మ.. కండరాల పనితీరును మెరుగుపరచడానికి ఇది అవసరం. అరటిపండులో కార్బోహైడ్రేట్లు , సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయానికి మంచివి అల్పాహారానికి బదులుగా అరటిపండ్లను తినవచ్చు.




