పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?

Updated on: Jun 30, 2026 | 8:07 PM

ఫూల్ మఖానా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఏదో ఒక రంగా తీసుకోవాలి అని చెబుతుంటారు. చాలా వరకు చిన్న పిల్లలకు ఉగ్గు రూపంలో దీనిని పెడుతుంటారు. ఏదిగే పిల్లలకు ఇది పెట్టడం వలన మెదడు పనితీరు మెరుగుపడి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటారు.

1 / 5
అయితే నార్మల్‌గా ఏలా వీటిని పిల్లలకు పెట్టినా అంతగా తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా దోశలు చేసి పెడితే, రుచికి రుచి ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. కాగా మఖానా దోశలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దా.

2 / 5
కావాల్సిన పదార్థాలు : ఫూల్ మఖానా కప్పు, అటుకులు కప్పు, బొంబాయి రవ్వ కప్పు, పెరుగు, నీళ్లు కప్పు, అలాగే ఉప్పు రుచికి సరిపడ, అల్లం ముక్క, ఉల్లియాలు, టమాటాలు, క్యాప్సికం, క్యారెట్.

3 / 5
తయారీ విధానంలోకి వెళితే..  దోశలు తయారు చేసుకోవడానికి ఒక రోజు ముందే మనం మఖానా దోశ పిండిని తయారు చేసుకోవాలి. దీని కోసం ఫుల్ మఖానా , అటుకులు, బొంబాయి రవ్వ తీసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని నీళ్లు పోసి, పెరుగు వేసి నానబెట్టుకోవాలి. 30 నిమిషాలు నానిన తర్వాత దీనిని మిక్సీ పట్టుకోవాలి.

4 / 5
అందులో చిన్న అల్లం ముక్క, పచ్చి వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. మరసటి రోజు ఉదయం అందులో క్యారెట్, టమాటా, క్యాప్సికం ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి.

5 / 5
ఇప్పుడు దోశల పాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, దానిపై నూనె వేసి, మనం కలిపి పెట్టుకున్న  పిండితో కాస్త మందంగా దోశలు వేసుకోవాలి. అంతే ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

Follow Us