బోనాల స్పెషల్.. నగరంలో నాటు కోడికి ఊహించని ధర.. కోడి కొనాలంటే కష్టమే!

Edited By:

Updated on: Aug 09, 2026 | 12:36 PM

హైదరాబాద్‌లో బోనాల సందడి మాములుగా లేదు. నగరం మొత్తం బోనాల ఉత్సవాలతో మారుమోగిపోతుంది. ఆడపడుచులు అందరూ అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు. అంతే కాకుండా బోనాల సందర్భంగా ఆది వారం యాటలకు, నాటు కోళ్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పలు చోట్ల నాటుకోళ్ల స్టాల్ ఏర్పాడ్డాయి, రోడ్డుపై నాటు కోళ్లను విక్రయిస్తున్నారు.

1 / 5
హైదరాబాద్‌లో బోనాల సందడి జోరందుకుంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతుండగా.. మరోవైపు నాటు కోళ్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి.

2 / 5
హైదరాబాద్ శివారులోని కాళీమందిర్, నార్సింగి, బుద్వేల్‌తో పాటు పలు ప్రాంతాల్లో నాటు కోళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రోడ్ల పక్కనే కోళ్లను పెట్టుకుని వ్యాపారులు విక్రయిస్తున్నారు. పండుగ కావడంతో ఉదయం నుంచే కొనుగోలుదారులతో ఈ ప్రాంతాలు సందడిగా కనిపిస్తున్నాయి.

3 / 5
నాటు కోళ్లకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.400 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. సాధారణ రోజులతో పోలిస్తే ధర ఎక్కువగా ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమకు నచ్చిన కోడిని ఎంచుకుని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

4 / 5
ప్రతి ఏడాది బోనాల సమయంలో నాటు కోళ్లకు మంచి గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి కూడా పండుగ నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగిందని అంటున్నారు. ఎక్కువ మంది కొనుగోలుకు వస్తుండటంతో ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు.

5 / 5
మొత్తానికి బోనాల వేళ నాటు కోళ్లకు మంచి డిమాండ్ వచ్చింది. కిలో రూ.450 వరకు ధర పలుకుతున్నా.. వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us