
Black Tea

ఉదయాన్నే అల్లం, మిరియాలు, పచ్చి పసుపుతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే లైకోరైస్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. లైకోరైస్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగడంతోపాటు పలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ టీ మంచి నిర్విషీకరణకు సహాయపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ సక్రమంగా ఉన్నప్పుడే జీర్ణక్రియ బాగుంటుంది. ఫలితంగా ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమంగా దీనిని సేవిచడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు బరువు కూడా త్వరగా తగ్గుతారు. అలాగే, మీరు సాధారణ గ్యాస్, గుండెల్లో మంట, కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మిల్క్ టీని పూర్తిగా మానేయాలి. బ్లాక్ టీ తాగడానికి ప్రయత్నించండి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక సమస్యలు తొలగిపోతాయి.

ఉదయాన్నే మిల్క్ టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు మిల్క్ టీని అస్సలు తీసుకోకూడదు. మధుమేహం ఉన్నప్పటికీ బ్యాక్ టీ తాగవచ్చు. అయితే అందులో చక్కెర లేకుండా చూసుకోవాలి.

సరున్ గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు షుగర్‌ని కొంత వరకు తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల పాల టీ తాగే అలవాటు మానేసి బ్లాక్ టీ తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.