- Telugu News Photo Gallery Black Rice Benefits in Telugu: Here's Surprising health benefits of Black Rice health tips in telugu
Black Rice Benefits: బ్లాక్ రైస్ తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఎప్పటికీ..
బ్లాక్ రైస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం రోజువారీ ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేకాకుండా.. కళ్లకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి..
Updated on: Jul 26, 2022 | 4:01 PM

బ్లాక్ రైస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం రోజువారీ ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేకాకుండా.. కళ్లకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ రైస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది.

బ్లాక్ రైస్ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కెరోటినాయిడ్స్ బ్లాక్ రైస్‌లో అధికంగా ఉంటాయి. సూర్య రశ్మి, ఇతర హాని కలిగించే ప్రకాశవంతమైన వెలుగులు లేదా కాంతి కిరణాల నుంచి కళ్ళకు రక్షణగా లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు ఈ బియ్యంలో ఉండటం మూలంగా కంటి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ రైస్ ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ బియ్యంలోని ప్రొటీన్లు, ఫైబర్ కారకాలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, త్వరగా ఆకలికాకుండా నిరోధిస్తుంది.




