
షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే డయాబెటిస్ బాధితులకు కాకరకాయ వరం లాంటిది అంటున్నార ఆరోగ్య నిపుణులు. కాకరకాయలోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు..కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

కాకరకాయ కూరతో పాటుగా జ్యూస్‌లా కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కాకరకాయ జ్యూస్ తీసుకోవటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

కాకరకాయలో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అలాగే, కాకరకాయ జ్యూస్‌లోని విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. మొటిమలను తగ్గించడంలో చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

తరచూ కాకరకాయ జ్యూస్ తీసుకోవటం వల్ల కాలేయాన్ని శుభ్రపరచడానికి, కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని విష వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

కాకరకాయలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ పెద్దప్రేగు కాన్సర్ల నివారణలో సహాయపడుతుంది. కాకరకాయలో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి కంటి సమస్యలను నివారించడానికి తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దంతాలను బలంగా ఉంచుతుంది.