
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టు మచ్చలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. పుట్టు మచ్చల ప్రకారం అదృష్టం కలిసి వస్తుందని, అలాగే కొన్ని స్థానాల్లో పుట్టు మచ్చలు ఉంటే దురదృష్టం వెంటాడుతుందని శాస్త్ర నిపుణులు అంటూ ఉంటారు. పుట్టు మచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పుట్టు మచ్చలు.. మనిషి వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించిన సమాచారాన్ని చెప్తాయని అంటూంటారు. మరి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి పెదవులపై పుట్టు మచ్చలు ఉంటాయి. పై పెదవి బయట అంచుపై పుట్టు మచ్చ ఉంటే శుభ ప్రదంగా చెబుతూ ఉంటారు. కానీ కింద పెదవిపై పుట్టు మచ్చ ఉండటం అంత మంచిది కాదని అంటూ ఉంటారు. ఇది చెడు అలవాట్లను సూచిస్తుందట.

కుడి భుజంపై పుట్టు మచ్చ ఉంటే డబ్బుకు లోటు ఉండదని, మనీకి సంబంధించిన లావాదేవీలు చక్కగా నిర్వహిస్తారని అంటారు. అదే విధంగా వీళ్లు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. ప్రతి సందర్భంలోనూ తెలివిగా వ్యవహరిస్తారు.

అదే విధంగా కుడి అర చేతిలో పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా శుభ ప్రదంగా భావిస్తారు. కుడి చేతిలో పుట్టు మచ్చ ఉంటే సంపన్నమైన, విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇలా వారు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు. విజయం వైపు దూసుకెళ్తారు.

ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చెవి లోపల, వెలుపల బాగంలో పుట్టు మచ్చ ఉంటే.. ఇది విలాసాల కోరికను సూచిస్తుంది. అదే విధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ భాగంలో పుట్టు మచ్చ ఉండటం అదృష్టంగా భావించినా.. వీరు డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు.