ప్రయాణిస్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు.. విజయనగరం జిల్లాలో కలకలం.. క్షణాల్లో బూడిదైన ద్విచక్ర వాహనం

Edited By:

Updated on: May 11, 2026 | 9:15 PM

విజయనగరం జిల్లాలో ప్రయాణిస్తున్న బైక్ నుంచి మంటలు చెలరేగి భయాందోళనకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రాజాం మండలం కంచరాం గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కంచరాంకి చెందిన అల్లు రామారావు, సూర్యనారాయణలు కలిసి గ్రామ సమీపంలోని కల్లాలకు వెళ్లి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తున్నారు.

1 / 5

2 / 5
గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో వాహనం సీటు కింద నుంచి ఓవర్ హీట్ వేవ్స్ రావడం వారిద్దరు గమనించారు. వెంటనే ప్రమాదాన్ని అంచనా వేసి వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపి దూరంగా వెళ్లారు. అలా నిలిపిన కొద్దిసేపటికే బండి నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. అనంతరం ఒక్కసారిగా మంటలు ఎగసిపడి వాహనం మొత్తం వ్యాపించాయి. వారి కళ్ల ముందే క్షణాల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి పేలిపోయింది.

3 / 5
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా ఎండల ధాటికి వాహనంలోని వైరింగ్ కిట్ లో మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.

4 / 5
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఉన్న  ద్విచక్ర వాహనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడం పట్ల ఎండల్లో బయటకు వెళ్లాలంటే వాహనదారులు హడలెత్తి పోతున్నారు. అదృష్టవశాత్తూ వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది.

5 / 5
అలా కాకుండా ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న ప్రాణహాని జరిగి ఉండేదని అంటున్నారు వాహనదారులు. జరిగిన ఘటన నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయకపోవడం మంచిదని అంటున్నారు అగ్నిమాపకశాఖ అధికారులు.

Follow Us