AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త! కెమికల్స్‌లేని పండ్లను ఇలా గుర్తించండి..

మామిడి పండ్ల సీజన్ మొదలైందంటే చాలు మార్కెట్లు పసుపు రంగు పండ్లతో కళకళలాడుతుంటాయి. అయితే, చూడ్డానికి మెరిసిపోతున్నాయని పండ్లను కొంటే మీరు విషాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. వ్యాపారులు లాభాల కోసం నిషేధిత క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కెమికల్స్‌తో పండించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 9:30 AM

Share
వేసవిలో మామిడి పండ్లకు ఉండే గిరాకీని ఆసరాగా చేసుకుని, వ్యాపారులు క్యాల్షియం కార్బైడ్ (Calcium Carbide) ఉపయోగించి కాయలను రాత్రికి రాత్రే పండిస్తున్నారు. సాధారణంగా మామిడి కాయలు పక్వానికి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ క్యాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడటం వల్ల కేవలం కొన్ని గంటల్లోనే కాయలు పండుగా మారిపోతాయి. ఈ కార్బైడ్ విడుదల చేసే అసిటిలిన్ వాయువు వల్ల పండు రంగు మారుతుంది కానీ, అందులో సహజమైన తీపి, సువాసన ఉండవు.

1 / 6
రసాయన పండ్లను గుర్తించడం ఎలా?: రంగులో తేడాను గమనించాలి. సహజంగా పండిన పండు పసుపు రంగులో ఏకరీతిగా ఉంటుంది. రసాయన పండ్లు పైన మెరుస్తున్న పసుపు రంగులో ఉన్నా, అక్కడక్కడ ఆకుపచ్చని మచ్చలు ఉంటాయి.

2 / 6
నీటి పరీక్ష (Float Test): ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉండి అడుగుకు చేరుతాయి. రసాయనాలతో పండించిన పండ్లు నీటిపై తేలుతాయి.

3 / 6
సువాసన: సహజమైన మామిడి పండుకు ఒక ప్రత్యేకమైన తియ్యని వాసన ఉంటుంది. కెమికల్ పండ్లకు అటువంటి వాసన ఉండదు లేదా ఘాటైన వాసన వస్తుంది. రసాయన పండును కోసినప్పుడు బయట పసుపుగా ఉన్నా, లోపల లేత తెలుపు లేదా పాలిపోయిన రంగులో ఉంటుంది.

4 / 6
ఆరోగ్య సమస్యలు: ఇలాంటి పండ్లు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో మంట వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

5 / 6
జాగ్రత్తలు: పండ్లను కొన్న తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద మరికొన్ని రోజులు ఉంచి తినడం మంచిది. తినడానికి ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పండ్లను బాగా కడగాలి. నమ్మకమైన రైతులు లేదా సేంద్రీయ (Organic) దుకాణాల నుండి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

6 / 6
Follow Us