Glowing Skin: ఖరీదైన మేకప్‌ కిట్స్ వద్దు.. ఈ సూపర్‌ఫుడ్స్‌తో సహజంగా అందాన్ని పెంచుకోండి!

Updated on: Feb 18, 2026 | 9:13 PM

Best fruit for skin whitening: వయసు పెరిగే కొద్దీ మన చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. దీంతో మన ఫేస్ డల్‌గా మారుతుంది. ఈ సమస్యను అదిగమించేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే ఖరీదైన మేకప్ ఉత్పత్తులను వాడుతారు. కానీ మన రోజువారి జీవనశైలిలో, ఆహారపు ఎంపికల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మన చర్మ కాంతిని ఈజీగా పెంచుకోవచ్చని ఇక్కడ చాలా మందికి తెలియదు. కాబట్టి, ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం ఏలాంటి ఆహారాలు తినాలో తెలుసుకుందాం.

1 / 6
అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఇందకోసం ఖరీదైన ఉత్పత్తుల వాడుతారు. కానీ సరైన ఆహారం తీసుకుంటే మన చర్మం సహజంగా మెరుగుపడుతుందని చాలా మందికి తెలియదు. అవును విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అలాగే సూర్మరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కాబట్టి నారింజ, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, బేరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను మీకు మంచి ఎంపిక.

2 / 6
డ్రై ప్రూట్స్: బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో, పొడిబారడాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఈ డ్రై ప్రూట్స్‌ అవసరమైన పరిమాణంలో తీసుకోవడం అలవాటు చేసుకోండి.

3 / 6
ఆకుకూరలు: పాలకూర, మెంతెం కూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల చర్మానికి సహజమైన మెరుపు లభిస్తుంది. కాబట్టి మీ రోజు వారి ఆహరంలో ఆకు కూరలను చేర్చుకోవడం ఉత్తమం.

4 / 6
చిలగడదుంప: ఇది కూడా చర్మం సంరక్షణకు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని లోపలి నుండి  మెరుగుపరుస్తాయి. చిలగడదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది అలాగే ముడతలు కూడా తగ్గుతాయి. అలాగే దానిమ్మ కూడా చర్మాన్ని ఆరోగ్యాన్ని కాపాడడంతో సూపర్‌గా పనిచేస్తుంది.దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది. అలాగే చర్మంపైఉన్న ఫైన్ లైన్స్ ను తగ్గిస్తుంది.

5 / 6
బొప్పాయి: బొప్పాయి రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపును శుభ్రంగా ఉంచుతాయి. బొప్పాయి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, ఇది మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

6 / 6
హైడ్రేటింగ్ ఆహారాలు,: దోసకాయలు, పుచ్చకాయలలో నీరు పుష్కలంగా ఉంటుంది, ఇది మీ చర్మాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది.  పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు పేగుతో సహా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తాయి, అవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో కూడా పోరాడతాయి,ఇవి చర్మ ప్రకాశాన్ని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు సహజంగా అందాన్ని పెంచుకోవచ్చు.

Follow Us