
పోషకాహర నిపుణులు, వైద్యులు చెబుతున్న ప్రకారం.. సమతుల్య ఆహారం మన మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇది యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇది మృదువైన, మెరిసే చర్మాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది. అలాగే జుట్టును ఒత్తుగా, దృఢంగా మార్చుతుంది.

ఎండు ఖర్జూరాలు: ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టును పొందడంలో కూడా సహాయపడుతుంది. ఖర్జూరంలో ఐరన్, విటమిన్ సి, డి పుష్కలంగా ఉన్నందున, అవి శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. దీన్ని బాగా గ్రైండ్ చేసి పాలలో కలుపుకుని తాగితే జుట్టు సమస్యలన్నీ తీరుతాయి.

Dried Apricots

డ్రై అంజీర్: అత్తి పండ్లలో డైటరీ ఫైబర్, కాల్షియం, కాపర్, ఐరన్, విటమిన్లు ఎ, సి, ఇ, కె మొదలైన ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మం ముడతలు, మొటిమలు, మచ్చలను క్లియర్ చేసి మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

ఎండుద్రాక్ష: ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ఎండుద్రాక్షలో ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, విటమిన్ బి, పొటాషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టుకు సహజమైన నలుపు రంగును అందించడంలో సహాయపడుతుంది.