
చాలా మంది ఎక్కువగా పకోడి, మిర్చీలు తినడానికి ఆసక్తి చూపుతారు. ఇక కొంత మందికి చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ 65 అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం చికెన్ లేకపోయినా కాలీఫ్లవర్‌తో కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూసేద్దాం. సుగంధ ద్రవ్యాలతో దీనిని చేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా దీనిని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే?

కావాల్సిన పదార్థాలు : రుచికి సరిపడ ఉప్పు, కారం, చిటికెడు పసుపు, కాలీ ఫ్లవర్ ఒకటి, ధనియాల పొడి టీ స్పూన్, జీలకర్ర పొడి, మిరియాల పొడి టీ స్పూన్, మొక్క జొన్న పిండి రెండు టేబుల్ స్పూన్స్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మినపప్పు, నూనె వేయించడానికి సరిపడ.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, మొక్కజొన్న పిండి, శనగపిండి, రుచికి సరిపడ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. కాస్త చిక్కగా బజ్జీల పిండి, పకోడి పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ పిండిలో కాలీఫ్లవర్స్ వేసి మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి. తర్వాత వీటిని ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి , నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో వేసి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే కాలీఫ్లవర్ పకోడి రెడీ.