Best anti ageing foods: యవ్వన చర్మం కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..!

Updated on: Mar 07, 2025 | 11:49 AM

చర్మ సంరక్షణపై కొంచెం శ్రద్ధ చూపడం ద్వారా మన ముఖాలపై వృద్ధాప్య సంకేతాలను కొంతవరకు నివారించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తుండటం వల్ల చాలా మంది మనోవేదనకు లోనవుతుంటారు. అలాంటివారు చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడకుండా..తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెడితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. యవ్వన చర్మానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలను తెలుసుకుందాం. వీటిని సూపర్‌ యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌ అంటున్నారు నిపుణులు.

1 / 5
నారింజ: నారింజ రుచిలో రుచికరమైనది మాత్రమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా అలసట, నీరసం కూడా తొలగిపోతుంది. నారింజ రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నిర్జలీకరణం కూడా జరగదు.

2 / 5
విటమిన్లు ఎ, బి, సి లతో సమృద్ధిగా ఉన్న బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవడం వల్ల మీ చర్మంపై ముడతలు, గీతలను వదిలించుకోవచ్చు. బొప్పాయి ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు, పపైన్, చైమోపాపైన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు కీలకమైనవి.

3 / 5
సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు తొలగిపోయి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. దీనిలో ఐసోఫ్లేవోన్‌లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్‌తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి.

4 / 5
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E అధికంగా ఉండే బాదంపప్పులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంపపపులో మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు(ఎంయూఎఫ్‌ఏ), విటమిన్‌ ఈ, పాలీఫైనాల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి.

5 / 5
టమాటాలలో ఉండే లైకోపీన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.