వర్షాకాలంలో వేప దివ్య ఔషధం.. ఆ సమస్యలన్నీ హాంఫట్ స్వాహా..

Updated on: Aug 04, 2025 | 3:56 PM

ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది. వేపను అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో అనేక సమస్యల నుండి కాపాడుతుంది. వేప వలన కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1 / 6
Neem

Neem

2 / 6
మధుమేహం నివారణిగా వేప ఆకు: వేపలో ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేపలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. వీటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు గోళ్లు, మొటిమలు మొదలైన అన్ని సమస్యలను నివారిస్తుంది.

3 / 6
ఉదర సమస్యలు దూరం: వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు కారణంగా ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్నికాపాడుతుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య ఉండదు. వేప ఆకులు అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీని వినియోగం కారణంగా జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది.

4 / 6
మొటిమల సమస్యకు చెక్: శరీరంలో ఏ ప్రదేశంలోనైనా కురుపుల లేదా మొటిమల  సమస్య ఉంటే వేప ఆకులతో పాటు దాని బెరడును రుబ్బి ఆ ప్రదేశంలో రాయాలి. కొద్ది రోజుల్లో ఆ సమస్య తొలగిపోతుంది.

5 / 6
వేప ఆకులు డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తాయి. మధుమేహంతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. ఉదర సంబంధ సమస్యలన్నింటికీ వేప ఆకులు దివ్యౌషధం.

6 / 6
వేప ఆకులు సహజ యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అన్ని దంత సమస్యలకు చాలా ప్రభావవంతమైన గృహ నివారణగా మారుతుంది. వేపను నమలడం,  తినడం వల్ల శరీరం విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. వేప ఆకులు పేగుల్లోని క్రిములను, చెడు బ్యాక్టీరియాను చంపుతాయి. వేప ఆకులు కడుపు ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తాయి.