Oral Hygiene: నోటి దుర్వాసన, పసుపు దంతాలను వదిలించుకోవడానికి సహజ మౌత్ వాష్.. ఇలా వాడి చూడండి

|

Apr 13, 2024 | 12:00 PM

నవ్వుతున్న మనిషి పది మందిని ఆకర్షిస్తాడు. అలా నవ్వుతుంటే అందరిని ముందుగా ఆకర్షించేది దంతాలు. అయితే కొంతమంది దంతాలు పసుపు రంగులోకి మారడంతో.. లేదా నోటి నుంచి వచ్చే దుర్వాసనతోనో పది మంది మధ్యకు రావాలంటే ఇబ్బంది పడతారు. దీంతో ఈ సమస్యను తొలగించుకోవడానికి చాలా మంది మౌత్ వాష్ వాడుతుంటారు. మౌత్ వాష్ నోటి కుహరంలోని అన్ని సూక్ష్మక్రిములను కూడా శుభ్రపరుస్తుంది. అయితే చేతిలో మౌత్ వాష్ లేకపోతే ఏమి చేయాలి? దంతాలు పసుపు రంగులో మారినా, చిగుళ్ళు గాయపడినా సింపుల్ చిట్కాలను పాటించి చూడండి. 

1 / 7
కొంతమంది పళ్లు తోముకున్న తర్వాత కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఈ సమస్యను తొలగించుకోవడానికి చాలా మంది మౌత్ వాష్ వాడుతుంటారు.

2 / 7
రోజు ప్రారంభంలో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడమే కాదు.. బహుళ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఇంట్లో దొరికే వస్తువులతోనే దంతాలను శుభ్ర పరచుకోవచ్చు, నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చు. ఇందుకు నిమ్మరసం బెస్ట్ ఆప్షన్. 

3 / 7
నిమ్మరసాన్ని మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చిగుళ్ళను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అలాగే నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

4 / 7
ఎక్కడికి వెళ్లినా టంగ్ క్లినర్, బ్రష్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే మౌత్‌వాష్‌ని ప్రతిచోటా తీసుకెళ్లడం సాధ్యం కాదు. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడితే దాన్ని వదిలించుకోవడానికి చూయింగ్ గమ్ మాత్రమే పరిష్కారం కాదు.

5 / 7
చూయింగ్ గమ్ బదులుగా నిమ్మరసం సహాయం తీసుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చిగురువాపులను తగ్గిస్తుంది, దంతాలు, చిగుళ్ల సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

6 / 7
నిమ్మరసం నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. నిమ్మరసం మౌత్ వాష్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకోండి. మొత్తం రసాన్ని ఒక గాజు గ్లాస్ లో పిండి ఆ  నిమ్మరసంలో నీటితో కలపండి. దీనిని మౌత్ వాష్ గా ఉపయోగిస్తూ రోజుకు 2-3 సార్లు పుక్కిలించండి. ఇది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

7 / 7
అయితే ఈ నిమ్మరసం ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి. నిమ్మరసంలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మ రసాన్ని మౌత్ వాష్ గా ఉపయోగిస్తూ నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల దంత క్షయం లేదా సున్నితత్వం ఏర్పడుతుంది.