
పులస చేపలోని పోషకాలు: పులస చేపలో విటమిన్లు డి, బి12, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫాస్పరస్, సెలీనియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటితో మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాల మంచిది అంటున్నారు నిపుణులు

గుండె ఆరోగ్యం: పులస చేప తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ చేపలో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్త పోటును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరును కూడా మెరుగు పరిచి, మతి మరుపును తగ్గిస్తుంది.

ప్రోటీన్ మెండుగా: పులస చేపలో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కండరాల నిర్మాణానికి కూడా సహాయ పడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

ఫైబర్: పులసలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగానే లభిస్తుంది. ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. దీన్ని వెంటనే మీ డైట్లో యాడ్ చేసుకోండి.

బరువు తగ్గుతారు: పులస చేప తింటే వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పులస తింటే వెయిట్ లాస్ అవ్వొచ్చు. పులస చేప తినడం వల్ల ఎముకలకు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.