
రుచికి చేదుగా ఉంటుందని కొందరు కాకరను దూరం పెడుతుంటారు. నిజానికి అది చేసే మేలు వెలకట్టలేనిది. కాకరలో ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి- విటమిన్లు, పీచు, పొటాషియం, సోడియం, భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం, క్యాల్షియం, రైబోఫ్లావిన్, రాగి, జింక్, ఐరన్‌లు ఉన్నాయి.

ఆరోగ్యంగా ఉండటానికి కాకర తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా కాకర జ్యూస్ పలు ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కాకర జ్యూస్ తాగడం మంచిది. కాకరకాయ జ్యూస్ ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఇంకా మంచిది.

కాకర జ్యూస్ ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా, చక్కెర సమస్యలు ఉన్నవారు కాకర రసం తాగడం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. అయితే అతిగా తీసుకోకూడదు.

కాకరకాయ రసం మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి మలినాలను, విషాన్ని తొలగించి వాటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాకర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చేరిన సూ

జుట్టు సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగవుతుంది. కాకరకాయలో విటమిన్ సి, పొటాషియం, జింక్, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగాలి. రోజుకు నాలుగు నుంచి ఐదు సిప్స్ కాకర జ్యూస్ తాగినా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.