
ఇది కేలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. కొబ్బరి నీళ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. దీని వినియోగం ఆకలిని నియంత్రిస్తుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రనలో ఉంటాయి. ఇందులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది.

జిడ్డు లేదా పొడి చర్మం సమస్యకు కూడా కొబ్బరి నీళ్లు భలేగా పనిచేస్తాయి. ఏ రకమైన చర్మానికైనా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్లలో దూదిని నానబెట్టి, అప్పుడప్పుడు దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన కొబ్బరి నీళ్ళు తాగడం కొంతమందికి హానికరం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వారిలో ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు.

coconut