
అధికంగా నీరు త్రాగాలి : అమ్మాయిలు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్ళను తీసుకోవాలి. అయితే, మొదటిసారి నీరు త్రాగడం కష్టం. ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత రెండు గ్లాసులు నీరు తాగితే స్కిన్ హైడ్రేట్ అవుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం : బయట ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టండి. అందంగా మారాలంటే కొన్ని రోజులు కఠినంగా ఉండాలి. మనం తీసుకునే చిన్న ఆహారం కూడా కూడా మన ముఖం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి బయట ఫుడ్స్ కు బదులు ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

బ్యూటీ ప్రొడక్ట్స్ : మీరు మొదటి సారి మీ ముఖానికి ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ వాడే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే, మీరు వాడిన ప్రోడక్ట్ మీ ముఖానికి పడకపోతే నల్ల మచ్చలు వస్తాయి. అప్పుడు ఉన్న అందం కూడా పోతుంది. కాబట్టి, వైద్య నిపుణుల సలహా మేరకు వాడటం మంచిది.

నిద్రలేమి సమస్య : నిద్రలేమి సమస్య చర్మం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజుకు 8 గంటల నిద్ర చాలా అవసరం. అప్పుడు మీ స్కిన్ తాజాగా ఉంటుంది. అలాగే మీరు సమయానికి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యమని అస్సలు మర్చిపోకండి.

మీ ముఖాన్ని ఎక్కువగా తాకవద్దు : మీ ముఖాన్ని ఎక్కువగా తాకడం వలన బ్యాక్టీరియా, క్రిములు వ్యాపించి చర్మం పొడిబారేలా చేస్తుంది. అలాగే వాటి వలన ముడతలు, మొటిమలు, నల్ల మచ్చలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖాన్ని శుభ్రపరిచే ముందు కూడా జాగ్రత్తగా ఉండండి.