
సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి చేసుకోబోతున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఇవాళ బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్ లో ఇటీవల వివాహ వేడుక ఘనంగా జరిగింది. వధువు తన సమీప బంధువు వెంకటేష్ తో కలిసి ఏడు అడుగులు వేసింది. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విలాసవంతమైన అలంకరణలు, సాంప్రదాయ ఆచారాలు బర్రెలక్క పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

స్నేహితులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య బర్రెలక్క వెంకటేష్ ను పెళ్లి చేసుకుంది. బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధువరూలను ఆశీర్వదించారు.

ఒకప్పుడు బర్రెలతో ఉపాధి పొందిన శీరిష.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది.