
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ పండు, తక్షణ శక్తిని అందించడంలో సహాయపడే ఒక గొప్ప ఆహారం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు రెండు అరటి పండ్లు తింటే.. ఇక ఆరోజంతా బాడీకి కావాల్సిన శక్తి వస్తుంది. కానీ మీరు ఖాళీ కడుపుతో పండును తినడం మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అరటి పండు తింటే అందులోని మెగ్నీషియం రక్తంలో చేరి గుండెపై ప్రభావం చూపుతుందంటున్నారు.

జిమ్‌కు వెళ్లే వారు, మార్నింగ్ వ్యాయామం చేసేవారికి శక్తిని ఇచ్చేందుకు ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు కరెకట్ట్‌గా వ్యాయామానికి 30 నిమిషాల ముందు లేదా తర్వాత ఈ పండు తినడం కండరాల అలసట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దాంతో పాటు మీకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.

చాలా మంది సాయంత్రం కాగాలనే టీ తాగడం స్నాక్స్ తినడం అలావాటు..కానీ దానికి బదులు ఈవినింగ్ ఈ పండు తినడం అలవాటు చేసుకుంటే ఆకలి తగ్గడంతో పాటు శరీరంలో అనసరమైన కోవ్వు పెరగడకుండా అడ్డుకోవచ్చు. అయితే మీరు ఈ పండును రాత్రి సమయంలో తినడం మంచిది కాదు. రాత్రి ఆలస్యంగా ఈ పండును తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

చాలా మంది మార్నింట్ నిద్రలేచిన వెంటనే.. ఏమి తినకుండా అరటి పండ్లను తింటూ ఉంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందని.. అందుకే సాధ్యమైనంత వరకు ఇతర ఆహారాలతో తీర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు రోజుకు 1 నుండి 2 పండ్లను సురక్షితంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవే అయినప్పటికీ.. మధుమేహం లేదా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు.. వీటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంటే పూర్తిగా తగ్గించకపోయినా.. పరిమితంగా తినాలిన సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పండ్లలోని సహజ చక్కెర, అధిక పొటాషియం కారణంగా అటువంటి రోగులలో వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.