Bajaj Scooter: సరికొత్త వెర్షన్‌లో బజాజ్ చేతక్ స్కూటర్.. 90 కి.మీ మైలేజ్.. పెట్రోల్‌తో పన్లేదు ఇక!

|

Mar 03, 2023 | 9:25 AM

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ..

1 / 5
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. సరికొత్త వెర్షన్లలో వాహనాలను తయారు చేస్తుంటారు.

2 / 5
 ఇందులో భాగంగానే బజాజ్.. తన బెస్ట్ మోడలైన చేతక్‌ను.. ఇటీవల సరికొత్త 'ప్రీమియం ఎడిషన్‌'లో విడుదల చేసింది.  మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, ధర ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందామా..

3 / 5
ఈ సరికొత్త బజాజ్ చేతక్ స్కూటర్ వేరియంట్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్. ఇప్పటికే ఈ వాహనానికి సంబంధించిన బుకింగ్స్ సైతం ప్రారంభమయ్యాయి. సదరు కంపెనీ ఏప్రిల్‌లో స్కూటర్లను డెలివరీ చేయనుంది.

4 / 5
ఇక మోడల్ విషయానికొస్తే.. డ్యూయెల్ టోన్ సీట్, రియర్ వ్యూ మిర్రర్స్, బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లు, హెడ్‌ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటివి ఉన్నాయి.

5 / 5
ఈ బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్‌లో 2.9 కిలోవాట్ బ్యాటరీ అమర్చబడి ఉండగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 90కిలోమీటర్లు మైలేజ్ పొందొచ్చు. ఇక ఇండియాలో దీని ధర రూ. 1.52 లక్షలు(ఎక్స్‌-షోరూమ్)