IND Vs AUS: ఆశ్విన్ తర్వాత రిటైర్ కాబోయే ప్లేయర్ అతనేనా?

|

Dec 19, 2024 | 12:19 PM

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా నుంచి తప్పుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఆ తర్వాత ఏ సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటిస్తారోనని క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది.

1 / 6
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ మధ్యలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు  అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరు ఊహించనేలేదు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభం కాకముందే కొందరు ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి వార్నింగ్ వచ్చింది.

2 / 6
న్యూజిలాండ్‌తో ఘోర పరాజయం తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై బీసీసీఐ కన్ను వేసింది. అలాగే ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టులోని ఇద్దరికి గేట్ పాస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి.

3 / 6
అందుకే ఈ సిరీస్‌ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ కీలకంగా మారింది. ఆ ప్లేయర్స్‌లో ఇద్దరూ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా అప్పట్లో నెటింట్లో వార్తలు వచ్చాయి.

4 / 6
ఈ వార్తలకు బలం చేకూర్చేలా, బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ అన్ని రకాల క్రికెట్‌లకు వీడ్కోలు పలికాడు. ఈ వీడ్కోలు తర్వాత టీమిండియా నుంచి మరో ఆటగాడు తప్పుకుంటాడనే చర్చలు కూడా మొదలయ్యాయి.

5 / 6
బోర్డర్-గవాస్కర్ సిరీస్ తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతారని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇంకా రెండు టెస్టుల ముందే రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఇంకా ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మాత్రమే మిగిలారు.

6 / 6
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సీనియర్ ఆటగాళ్లుగా జట్టులో కొనసాగుతున్నారు. వారిలో 37 ఏళ్ల రోహిత్ శర్మ అందరీ కన్నా పెద్దవాడు. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.