
పుట్టిన వెంటనే బిడ్డ ఏడవడం చాలా మంచిదని మనం తరచుగా వింటూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో పుట్టిన వెంటనే శిశువు ఏడవకపోతే వైద్యులు కూడా కంగారు పడిపోతారు. బిడ్డను ఏడిపించేందుకు ప్రయత్నిస్తారు. వీపుపై కొన్ని బిడ్డను ఏడిపిస్తారు. బిడ్డ ఏడ్చిన తర్వాత అందరూ ఊపరిపీల్చుకుంటారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం

పుట్టిన తర్వాత బిడ్డ ఏడవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బిడ్డ మొదటి శ్వాస తీసుకోవడానికి ఏడుపు చాలా ఉపయోగపడుతుంది. పుట్టిన కొన్ని సెకన్ల తర్వాత, అంటే 8 సెకన్ల తర్వాత శిశువు ఏడుపు ద్వారానే మొదటి శ్వాస తీసుకుంటుందని వైద్యులు అంటున్నారు.

ఈ ప్రక్రియ శిశువు ఊపిరితిత్తులను గాలితో నింపడానికి చాలా ముఖ్యమైనదిని వైద్యులు చెబుతున్నారు. శిశువు ఏడ్చినప్పుడు పీల్చుకునే గాలి నేరుగా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడానికి ఇది సహాయపడుతుంది.

ఒక వేల పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోతే.. డాక్టర్ వెంటనే శిశువును పరీక్షిస్తాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకొని బిడ్డను వెనక్కి తిప్పి వీపుపై నెమ్మదిగా కొడతారు. అప్పుడు బిడ్డ ఏడవడం స్టార్ట్ చేస్తుంది.

అలా చేసినా బిడ్డ ఏడవకపోతే, శిశువు నోరు, ముక్కును యంత్రంతో శుభ్రం చేస్తారు. అవసరమైతే, CPR కూడా ఇస్తారు. ఇలా చేసిన తర్వాత బిడ్డ ఏడుస్తుంది. అలా జరగకపోతే బిడ్డ సజీవంగానే ఉన్నాడా లేదా అని పేరెంట్స్ బయపడుతారు. ఏడ్చిన తర్వాత కాస్త కుదుటపడుతారు. అందుకే నవజాత శిశువు ఏడవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతారు.