Food To Avoid With Tea: టీతో వీటిని కలిపి తింటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

Updated on: Jul 21, 2023 | 8:27 PM

మీరు టీతో బిస్కెట్‌లకు బదులుగా వేయించిన శనగలు, బాదం, రెండు జీడిపప్పు లేదా ఎండుద్రాక్షలను తినవచ్చు. లేదంటే పొడి బ్రెడ్ తినవచ్చు. ఈ ఆహార పదార్ధాలు టీతో కలిసి తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆకలి తీరుతుంది. .

1 / 6
బ్రిటిష్ వారి నుంచి వచ్చిన అలవాటు అయినా ఎక్కువమంది భారతీయులు టీ లేకుండా జీవించలేరని చెప్పవచ్చు. నిద్ర లేచిన వెంటనే టీ కావాలి. ఒక కప్పు టీతో రోజు ప్రారంభం అవుతుంది.   

2 / 6
మధ్యాహ్నం లేదా సాయంత్రం కూడా టీ ఉండాల్సిందే. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత, ఫ్రెష్ అప్ కావడానికి ప్రతి ఒక్కరూ కప్పు టీ తీసుకుంటారు. అయితే టీతో పాటు బిస్కెట్లు ను కొందరు తీసుకుంటే.. మరికొందరు కట్లెట్స్, నూనెలో వేయించిన పదార్ధాలను టీ తో కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం వలన జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

3 / 6
బిస్కెట్లలో పిండి ఉంటుంది. ఈ పిండి వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. అంతేకాదు ఈ పిండి ఇన్సులిన్ అసమతుల్యతను కలిగిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే BHA,  హానికరమైన DNA ఉంటాయి.

4 / 6
టీతో కలిపి శనగలను తినండి. నూనెలో కాకుండా పొడి ఇసుకలో వేయించిన శనగలు తినండి. అయితే శనగల్లో అదనపు ఉప్పు, సుగంధ ద్రవ్యాలను కలపవద్దు. వేయించిన శనగల్లో ఫైబర్ ఉంటుంది. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

5 / 6
శనగల్లో కాల్షియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 

6 / 6
టీతో పాటు డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. ఇవి ఆకలిని తీరుస్తాయి. జీర్ణ సమస్యలు ఉండవు. అంతేకాదు టీతో కాల్చిన మఖానాను కూడా తినవచ్చు. మఖానాను నెయ్యిలో కొద్దిగా మిరియాల పొడితో వేయించాలి. ఆకలిగా ఉన్నప్పుడు లేదా టీతో తినండి.