Top 10 safest car in india: క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ గుర్తింపు పొందిన బెస్ట్ కార్లు ఇవే.. వివరాలు మీకోసం..

|

Apr 11, 2023 | 2:21 PM

Top 10 Safest Car: ఇటీవల గ్లోబల్ NCAP అనేక కార్లను క్రాష్ టెస్ట్ చేసింది. ఆ పరీక్ష ప్రకారం దేశంలో టాప్10 సేఫ్ కార్ల టిస్ట్‌ను విడుదల చేసింది.

1 / 11
కారు కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూస్తారు. అదే సమయంలో కారు ఎంత సురక్షితమైందో కూడా చెక్ చేస్తారు. అందుకే వాహనాల భద్రతపై కంపెనీలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఇటీవల గ్లోబల్ NCAP అనేక కార్లను క్రాష్ టెస్ట్ చేసింది. ఆ పరీక్ష ప్రకారం 10 కార్లను టాప్ 10 సేస్ కార్స్‌గా లిస్ట్‌లో చేర్చారు. ఆ కార్లన్నింటికీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో వోక్స్‌వ్యాగన్ వర్టస్ నుండి టాటా నెక్సాన్ వరకు ఉన్నాయి. మరి ఆ 10 కార్లు ఏవో ఒకసారి చూద్దాం.

2 / 11
వోక్స్‌వ్యాగన్ వర్టస్: జర్మన్ ఆటో కంపెనీ ఫోక్స్‌వ్యాగన్‌కి చెందిన ఈ కారు జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌లు సాధించిన భారతదేశపు మొదటి సెడాన్‌గా ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా నిలిచాయి. ఈ కార్లు పెద్దలు, పిల్లలకు భద్రత విషయంలో 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 11.48 - 18.57 లక్షలుగా ఉంది.

3 / 11
వోక్స్‌వ్యాగన్ టైగన్: ఇది భారతదేశంలోని సురక్షితమైన SUVలలో ఒకటి. టైగన్ కాంపాక్ట్ SUV 2022 గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్‌లను సాధించింది. వోక్స్‌వ్యాగన్ టైగన్ పెద్దలు, పిల్లల భద్రతలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. కారు ధర రూ.11.61 లక్షలు.

4 / 11
టాటా పంచ్: గ్లోబల్ NCAPలో టాటా పంచ్ 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ కారు ఇండియన్ మార్కెట్‌లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కారు XUV700కి సమానమైన భద్రతా రేటింగ్‌ను కలిగి ఉంది. పంచ్ మొత్తం సెక్యూరిటీ స్కోర్ 57.34 పాయింట్లను కలిగి ఉంది. ధర రూ. 9.47 లక్షలు.

5 / 11
టాటా నెక్సాన్: ఈ టాటా SUV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఈ సబ్-కాంపాక్ట్ SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఇది పిల్లల రక్షణలో 3-స్టార్‌లను మాత్రమే పొందింది. కారు ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

6 / 11
టాటా ఆల్ట్రోజ్: టాటా మోటార్స్ కంపెనీలో అత్యధిక సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లలో ఆల్ట్రోజ్ ఒకటి. గ్లోబల్ NCAPలో 5 స్టార్ రేటింగ్ పొందిన భారతదేశపు ఏకైక హ్యాచ్‌బ్యాక్. టాటా ఆల్ట్రోజ్ పెద్దల భద్రతలో 5-స్టార్‌ రేటింగ్, పిల్లల భద్రతలో కేవలం 3-స్టార్‌ రేటింగ్ పొందింది. దీని ధర రూ.6.44 లక్షలు.

7 / 11
స్కోడా స్లావియా: ఈ కారు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ని పోలి ఉంటుంది. పేరు, ధర, కొన్ని ఫీచర్లు మాత్రమే డిఫరెంట్. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో వోక్స్‌వ్యాగన్ వర్టస్ వలె 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. స్లావియా స్కోడా ఫ్లాగ్‌షిప్ మోడల్ ధర రూ.11.39 లక్షలు.

8 / 11
స్కోడా కుషాక్: ఈ కారు ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ను పోలి ఉంటుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్‌ రేటింగ్ సాధించింది. స్కోడా కుషాక్ పెద్దలు, పిల్లలకు భద్రత విషయంలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ కారు ధర రూ.11.59 లక్షలు.

9 / 11
మహీంద్రా XUV700: మహీంద్రా XUV700 భద్రత పరంగా మొదటి స్థానంలో ఉంది. XUV700 పెద్దల రక్షణ విషయంలో 5-స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. అయితే, ఇది NCAP క్రాష్ టెస్ట్‌లో 57.69 పాయింట్లను సాధించింది. స్కార్పియో N కంటే తక్కువ. వీటి ధరలు రూ.13.45 లక్షల నుంచి రూ.25.47 లక్షల వరకు ఉన్నాయి.

10 / 11
మహీంద్రా XUV300: మహీంద్రా XUV300 మహీంద్రా కంపెనీ మూడవ SUV. ఇది గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. క్రాష్ టెస్ట్‌లలో ఇది అత్యధిక భద్రతా రేటింగ్‌ను పొందింది. మహీంద్రా XUV300 వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్‌లను, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రేటింగ్‌లో 4-స్టార్‌లను స్కోర్ చేసింది. కారు ధర రూ.8.41 లక్షల నుంచి రూ.14.07 లక్షల వరకు ఉంది.

11 / 11
మహీంద్రా స్కార్పియో ఎన్: మహీంద్రా నుండి వచ్చిన ఈ SUV కస్టమర్‌లను దృష్టిని ఆకర్షిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా స్కార్పియో N 58.18 పాయింట్లు సాధించింది. SUV పెద్దల భద్రతలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. అదే సమయంలో పిల్లల రక్షణలో 3- స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. వీటి ధరలు రూ.12.74 లక్షల నుంచి రూ.24.05 లక్షల వరకు ఉన్నాయి.