
నాన్-వెజ్: మాంసాహారంలో కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణం అయ్యేందుకు కూడా చాలా సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట మాంసాహరానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్ ఏ సమయంలో తిన్నా కూడా కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అయితే డిన్నర్‌లో స్పైసీ ఫుడ్‌ను తీసుకుంటే మాత్రం అది జీర్ణం కావడం అంత తేలిక కాదు. ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు.

కాఫీ: రాత్రి భోజనం చేసిన అనంతరం కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అయితే కాఫీలో కెఫిన్ శాతం అధిక మోతాదులో ఉంటుంది గనుక అది నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో కాఫీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.

టీ: రాత్రిపూట భోజనం చేశాక కొంతమంది టీ తగుతుంటారు. కాఫీలో మాదిరిగానే టీ ఆకులలోనూ కెఫిన్ ఉంటుంది. నిద్రపోయే ముందు టీని సేవించడం వల్ల.. అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది.

జంక్ ఫుడ్: జంక్ ఫుడ్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఎక్కువ. అంత త్వరగా జీర్ణం కాదు. రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఇది మాత్రమే దీని కారణంగా మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.