
వాతవరణంలో మార్పులకనుగుణంగా కూడా ఇంట్లోకి కీటకాల రాకలు ఉంటాయి. వీటితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వేసవి కాలంలో ఎక్కువగా ఇంట్లోకి చీమలు, ఈగలు, బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంటికి ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా.. చీమలు, బొద్దింకలు, దోమలు, ఈగలు ఉంటూనే ఉంటాయి.

వీటిన వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ కీటకాలను ఇంట్లోకి రానివ్వకూడదు. అంతే కాకుండా చెద పురుగులు, బెడ్ బగ్స్ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. వీటిని సింపుల్‌గా ఇంట్లో నుంచి వెళ్లగొట్టొచ్చు.

ప్రతీ ఒక్కరి ఇంట్లో వెల్లుల్లి అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఒక వెల్లుల్లి రెబ్బ, చిన్న ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని.. ఇందులో కొద్దిగా మిరియాల పొడి కలపాలి. ఇందులో నీళ్లు పోసి ఓ రెండు గంటల పాటు పక్కకు పెట్టండి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి.. నీటిని స్ప్రే బాటిల్‌లో వేయాలి. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని కీటకాలు ఉన్న చోట స్ప్రే చేయండి. అంతే ఈ ఘాటు వాసనకు కీటకాలన్నీ మాయం అయిపోతాయి. స్ప్రే చల్లిన చోట పిల్లల్ని రానివ్వకండి.

అదే విధంగా ఒక చిన్న బౌల్‌లోకి యాపిల్ సైడర్ వెనిగర్, డిష్ వాష్ లిక్విడ్ బాగా కలపాలి. ఈ లిక్విడ్‌ని కూడా స్ప్రే బాటిల్‌లో వేసుకుని.. కీటకాలపై స్ప్రే చేయండి చాలు. ఈ వాసనకు అవి అక్కడికక్కడే చనిపోతాయి.