Flax Seeds : అవిసె గింజలు వీళ్లకు మంచిది కాదు.. అస్సలు తినొద్దు..!

|

Jan 15, 2025 | 8:38 AM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం పోషక విలువలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాంటిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని ఆహారాలను కూడా అందరూ తినకూడదట. కేవలం కొందరు మాత్రమే తినాలి. అలాంటివాటిలో అవిసె గింజలు కూడా ఉన్నాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఇతర పోషకాలు తగినంత మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో, కొంతమంది వీటిని తినకుండా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, వీటిని ఎవరు తినాలో.. ఎవరు తినకూడదో ఓసారి చూద్దాం...

1 / 5
జీర్ణ సమస్యలు ఉన్నవారు అవిసె గింజలను తినకూడదు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లేదా డయేరియా వంటి సమస్యలు పెరుగుతాయి. మీరు ఇప్పటికే బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటుంటే, అవిసె గింజలను తినకుండా ఉండండి. దీన్ని తినడం వల్ల రక్తం పల్చగా మారుతుంది. తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

2 / 5
ఫ్లాక్స్ సీడ్స్ తిన్న తర్వాత కొంత మందికి అలర్జీ సమస్యలు మొదలవుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. అవిసె గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఇవి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. గర్భధారణ సమయంలో అవిసె గింజలను తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

3 / 5
ఆయుర్వేదం ప్రకారం, అవిసె గింజలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి వేడిని కలిగిస్తాయి. శరీరంలోని పిత్త, కఫా మూలకాలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అందువల్ల, పొడి, అకాల ముడతలు, పుండ్లు పడడం వంటి చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు మందులా వీటిని మితంగా తీసుకోవాలి.

4 / 5
సీడ్ సైక్లింగ్ అని పిలువబడే ఈ అవిసె గింజలను అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుదుంది. అందువల్ల, మీరు అధిక ఋతుస్రావం, శరీరంలో అధిక వేడి, గర్భం ధరించడానికి ప్రయత్నించడం, తక్కువ లిబిడోతో పోరాడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు వీటిని తినకుండా ఉండటమే మంచిది.

5 / 5
అవిసె గింజల్లో ఉండే విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టుకు మేలు చేస్తాయి. అవిసె గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.