heels Crack: మడమలు పగిలి నొప్పిగా ఉన్నాయా.. ఇవి రాస్తే సరి!

|

Nov 22, 2024 | 6:12 PM

చలికాలంలో వచ్చే సమస్యల్లో మడమలు పగిలిపోవడం కూడా ఒకటి. మడమలు పగిలిపోవడం వల్ల ఒక్కోసారి చాలా నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పిని భరించడం కష్టం. నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది..

1 / 5
చలికాలం వచ్చిందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతాయి. చర్మం పగలిపోవడం, పొడిబారిపోవడం, తేమను కోల్పోవడం, చర్మం నిర్జీవంగా మారడం, కాళ్ల మడమలు పగలడం ఇలా ఒక్కటేంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎటాక్ చేస్తాయి.

2 / 5
అదే విధంగా సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇలా వీటితో పాటు మడమలు కూడా పగులుతూ ఉంటాయి. ఒక్కోసారి మడమలు తీవ్రంగా పగిలి, చాలా నొప్పిగా ఉంటుంది. అందులోనూ బయట పని చేసేవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది.

3 / 5
మడమల పగుళ్లు వచ్చినప్పుడు క్లీనింగ్ చాలా ముఖ్యం దుమ్ము, ధూలి కారణంగా ఎక్కువగా మడమలు పగులుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో కాళ్లను కూడా ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉండాలి. దీని వల్ల పగుళ్లు పెద్దగా రావు. వచ్చినా త్వరగా తగ్గిపోతాయి.

4 / 5
చల్లటి నీళ్లు వాడితే కాళ్లు మరింత డ్రై అయిపోతాయి. కాబట్టి చలి కాలంలో గోరు వెచ్చటి నీటిని ఉపయోగించండి. కాళ్లు కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి.

5 / 5
మాయిశ్చరైజర్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా నూనె రాసినా పర్వాలేదు. రాత్రి పూట పడుకునే ముందు మడమలకు నూనె పట్టించండి. ఇలా చేయడం వల్ల త్వరగా మెత్తబడతాయి. వాజెలిన్, తెనే రాసినా పర్వాలేదు.