
కావాల్సిన పదార్ధాలు : పావు కిలో పాచి టమాటోలు, 150 గ్రాముల పచ్చిమిర్చి, 100 గ్రాముల చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, రెండు ఉల్లిపాయలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో పచ్చి టమాటా ముక్కలు దానిలో వేసి అవి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు వేసి స్టవ్ మీదే వాటిని వేయించాలి.

ఇక ఇప్పుడు రొటీలో పచ్చి టమాటా ముక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ ను వేసి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా బాగా రుబ్బుకోవాలి.

ఇక ఇప్పుడు పోపుపెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, పచ్చి శనగపప్పు, మినుములు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర వేసి దానిని పోపు వేసుకోవాలి

అంతే, వేడి వేడి పచ్చి టమాటా పచ్చడి రెడీ. దీనిని వేడి అన్నంలో ఒక స్పూన్ వేసి తింటే చికెన్, మటన్ కూడా సరిపోవు. మీరు కూడా మీ ఇంట్లో ఈ కొలతలతో ట్రై చేయండి.