నాగమ్మ తల్లి ఉనికికి నిదర్శనం.. 44 ఏళ్లుగా పూరి గుడిసెలో గుట్టలా పెరిగిన పాముల పుట్ట..

Edited By:

Updated on: Dec 22, 2025 | 2:05 PM

నాగుల చవితికి మినహా మిగిలిన సమయాలలో పాము పుట్టకు ఎవరూ పూజలు చేయరు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి 44 సంవత్సరాలుగా తన ఇంటిలో పాము పుట్టకు నిత్యం పూజలు చేస్తూ ఆ పుట్టనే దైవంగా కొలుస్తూ ఉన్నాడు.. 1981లో చిన్న పుట్టగా ఇంటిలో ఏర్పడిందని ఇప్పుడు 10 అడుగుల వరకు ఈ పుట్ట ఉంటుందని ఆ పుట్టకు పూజలు చేసే వెంకయ్య అంటున్నాడు.

1 / 5

2 / 5
కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం లోని కుమ్మరి కొట్టాల ప్రాంతంలో కంభం వెంకయ్య అనే వ్యక్తి మట్టి కుండలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు . అయితే అతడు కుండలు తయారు చేసి నివాసం ఉండే ఇంటిలో 1981 వ సంవత్సరంలో చిన్నగా పుట్ట ఏర్పడిందని ఆ తరువాత నుంచి దానంతట అదే పెరుగుతూ ప్రస్తుతం పది అడుగుల ఎత్తు వరకు పెరిగిందని వెంకయ్య తెలిపారు.

3 / 5
పుట్ట వెలసిన దగ్గర నుంచి నిత్యం పూజలు చేస్తున్నానని ప్రతిరోజు ఈ పుట్టకు పూజ చేసిన తర్వాతే తన పనిని ప్రారంభిస్తానని వెంకయ్య అన్నాడు .. అలాగే నాగుల చవితి సమయంలో మరియు ఎవరికైనా కాల సర్ప దోషాలు ఉన్నవారు ఈ పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటారని , వచ్చిన భక్తుల వద్ద నుంచి ఎటువంటి ఆర్జన ఆశించనని వచ్చిన భక్తులే పుట్టక పూజలు చేసుకుని వెళ్తుంటారని వెంకయ్య తెలిపారు.

4 / 5
ఇక్కడ పుట్టలో పాము వచ్చి భక్తుల ప్రసాదాలను స్వీకరిస్తుందని ఆయన అన్నారు ఈ పుట్టలో ఉన్న పాము ఎప్పుడు  ఎవరికీ ఏ హాని చేయలేదని, నాగుల చవితి సమయంలో తప్పకుండా ఇక్కడ పాము కనిపిస్తుందని ఆయన తెలిపారు. దాదాపు 50 ఏళ్ల పైగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారని 44 సంవత్సరాలుగా ఈ పుట్టకు నిత్యం పూజలు చేస్తున్నాన వెంకయ్య తన భక్తిని చాటుకున్నారు.

5 / 5
  అంతేకాకుండా తన కుండలు చేసే మట్టితో చిన్న శివలింగాన్ని కూడా తయారు చేసి పుట్ట పక్కన ఏర్పాటు చేసి అక్కడ కూడా పూజలు నిర్వహిస్తానని ఆయన అన్నారు.  ఏది ఏమైనా 44 సంవత్సరాలుగా ఒక పుట్టకు పూజలు చేస్తూ శివయ్య పై తనకున్న భక్తి భావాన్ని వెంకయ్య చాటుకున్నారు.