1 / 5
శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఇందులో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో, కంటి చూపు, చర్మాన్ని మెరుగు పర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవాళ్లకు ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. అయితే ఉసిరితో ఎన్నో ఉపయోగాలు ఉన్నా పలు వ్యాధులున్నవారు తినకపోవడం మంచిదంటున్నారు. ఒకవేళ తిన్నట్లయితే మీరు లాభానికి బదులుగా నష్టాన్ని చవిచూడవచ్చు.