
ఫైబర్ ఫ్యాక్టరీగా కూడా రాజ్మాను పిలుస్తారు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో పాటు మలబద్ధకం నివారించడానికి కూడా కీలక పాత్ర పోషస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీర బరువును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

రాజ్మాను ప్రోటీన్ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. రాజ్మాలో అద్భుతమైన ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మతుకు, శరీర కణజాలాల పునరుత్పత్తికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇందులో ఉండే ఇతర మూలకాలు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

రాజ్మాలోని ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గుండె జబ్బులు కూడా దూరమవుతాయి.

రాజ్మాలోని ఫైబర్, ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా చేర్చుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉటుంది. దీంతో పాటు పొట్టను నిండుగా కూడా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. ఫలితంగా మంచి బరువు నిర్వహణకు తోడ్పడుతుంది.

రాజ్మాలోని ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గుండె జబ్బులు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.