
పులి హోర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సరైన చేయి తగిలితే.. అమృతంలా ఉంటుంది పులిహోర. ఇంట్లో చేసే పులిహోర కంటే గుడిలో పెట్టే పులిహోర ప్రసాదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కొంత మంది అయితే ప్రసాదాల కోసమే గుడికి వెళ్తూ ఉంటారు.

పులిహోరలో ఎన్నో రకాలు ఉన్నాయి. పులిహోర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పెద్దలు పండుగలు వచ్చాయంటే పులిహోర చేస్తూ ఉంటారు. చింత పండు, నూనె, నెయ్యి, ఇంగువ, కరివేపాకు, పచ్చి మిర్చి, తాళింపు దినుసులతో చేసే ఈ పులిహోరలో ఆరోగ్యానికి సంబంధి ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.

పులిహోరలో.. ఉసిరి, మామిడి, గోంగూర, ఆవ పెట్టిన, చింత పండు, నిమ్మకాయలతో ఎక్కువగా పులిహోరను చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కో చేసే విధానం బట్టి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఆధార పడి ఉంటాయి.

పులిహోరలో కూడా ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అయితే పులిహోర ఎక్కువగా తింటే వేడి చేస్తుందని అంటారు.

అందుకే పులిహోర ఎంత రుచిగా ఉన్నా కొద్దిగా తినడం మంచిది. పులిహోర తిన్న అనంతరం మజ్జిగ తాగుతూ ఉంటారు. ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు కూడా పులిహోరలో చక్కగా లభిస్తాయి. కాబట్టి పులిహోరను తీసి పారేయకండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)