
దానిమ్మపండులో యాంటీ ఇన్‌ప్లేమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీని వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక దానిమ్మ తింటే 83 కేలరీల శక్తి లభిస్తుంది. దానిమ్మలో కార్బోహైడ్రేడ్స్, షుగర్, ఫైబర్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మపండును రెగ్యులర్‌గా తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. దానిమ్మలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

దానిమ్మ తింటే మలబద్దకం, అజీర్తి కంట్రోల్ అవుతాయి. దానిమ్మలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్ అందిస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఉదయాన్నే దానిమ్మ తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. రెగ్యులర్‌గా దానిమ్మపండు తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వలన రక్తప్రవాహం మెరుగవుతుంది.

దానిమ్మ పండులో ఫ్లేవనాయిడ్లు మరియ పాలీఫినాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్‌ఫ్లేమేషన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడంలో దానిమ్మ పండు దోహదం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో దానిమ్మ పండు ఎంతో సహాయం చేస్తుంది. దానిమ్మపండును రెగ్యులర్‌గా తినడం వలన రక్తప్రవాహం మెరుగవుతుంది. దీని వలన గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Pomegranate

దానిమ్మ తింటే ఫ్రీ రాడికల్స్ తొలగుతాయి. చర్మం మెరుస్తుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. దానిమ్మ తింటే కణాల డ్యామేజీ తగ్గుతుంది. వాపు తగ్గుతుంది. దానిమ్మలో ఫాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిమ్మ తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుతుంది.