బొబ్బర్లు తింటే బోలెడన్నీ లాభాలు.. బరువు తగ్గడమే కాదు గుండెకు భరోసా..!

Updated on: Nov 25, 2025 | 12:29 PM

బొబ్బెర్లను అలసందలు అని కూడా పిలుస్తారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ,సి,కె, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తాయి. బొబ్బర్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.

1 / 5
బొబ్బర్లలోని ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. తద్వారా జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బొబ్బర్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం ద్వారా ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గుతారు. కొవ్వు కూడా కరిగిపోతుంది.

బొబ్బర్లలోని ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. తద్వారా జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బొబ్బర్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం ద్వారా ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గుతారు. కొవ్వు కూడా కరిగిపోతుంది.

2 / 5
బొబ్బర్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. . బొబ్బర్ల లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

3 / 5
బొబ్బర్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే వీటిని తిన్నా కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. దీంతో డయాబెటిస్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. బొబ్బర్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి కాపాడుకోవచ్చు.

4 / 5
బొబ్బర్లలో ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచి రక్తహీనత దూరం చేస్తాయి. అందుకే రక్తహీనత ఉన్నవారు ఈ బొబ్బర్లు తినడం చాలా మంచిది.

5 / 5
బొబ్బర్లలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంటుంది. వయసు పెరిగినా కంటిచూపు తగ్గకుండా కాపాడుతుంది. బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మకణాలను రక్షిస్తాయి. తద్వారా చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది.

Follow Us