Ashwagandha Chai: అశ్వగంధ ఛాయ్‌తో అద్భుతమైన లాభాలు.. ఇలాంటి వ్యాధులన్నీ మటుమాయం…!

|

Dec 31, 2024 | 6:10 PM

ఆయుర్వేదం ప్రకారం, అశ్వగంధ ఒక అద్భుత మూలికగా చెబుతారు. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ మూలికను ఉపయోగించి కమ్మటి టీ తయారు చేసుకుని తాగితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో అశ్వగంధ ఛాయ్‌ తీసుకోవటం వల్ల రెట్టింపు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
అశ్వగంధ ఒక అద్భుతమైన అడాప్టోజెన్. ఇది శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా మార్చడంలో సహాయపడుతుంది. చలికాలంలో వేధించే జలుబు, దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీ చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.

2 / 6
అశ్వగంధ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నిద్రలేమిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా చేస్తుంది. అంతేకాదు.. శరీరంలో శక్తి స్థాయిలను పెంచి, అలసటను తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అశ్వగంధ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

3 / 6
అశ్వగంధ టీ తయారీ కోసం ఒక కప్పు నీరు, అర టీస్పూన్ అశ్వగంధ పొడి, పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు అల్లం ముక్క, రుచికి తగినంత తెనేను తీసుకోవాలి. ఒక చిన్న పాత్రలో నీటిని మరిగించుకోవాలి.. మరిగే నీటిలో అశ్వగంధ పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, అల్లం ముక్క  వేసి బాగా కలుపుకోవాలి.  మిశ్రమాన్ని మరో 2-3 నిమిషాలు మరిగించండి. బాగా మరిగిన నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి తగినంత తేనె కలిపి వెచ్చగా తాగేయాలి.

4 / 6
అయితే, ఈ అశ్వగంధ టీని కొందరు తాగకుండా ఉంటేనే మంచిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చే స్త్రీలు ఈ టీ తాగకూడదు అంటున్నారు. ఎందుకంటే అశ్వగంధ గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే గర్భవతులు పాలిచ్చే, స్త్రీలు అశ్వగంధ ఛాయ్‌ తాగడం మానుకోవడం మంచిదని చెబుతున్నారు.

5 / 6
ఏదైనా సర్జరీ చేయించుకునే వారు ముందు రెండు వారాల పాటు అశ్వగంధ ఛాయ్‌ తాగడం మానుకోవడం మంచిది. ఎందుకంటే అశ్వగంధ రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు. అలాగే, అశ్వగంధ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు అశ్వగంధ ఛాయ్‌ తాగే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

6 / 6
అశ్వగంధ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే రక్తపోటు ఉన్నవారు అశ్వగంధ ఛాయ్‌ తాగే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. కొంతమందిలో అశ్వగంధకు అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారు అశ్వగంధ ఛాయ్‌ తాగడం మానుకోవడం మంచిది. ఇతర మందులు వాడేవారు కూడా అశ్వగంధ టీ మానుకోవటం మంచిది.