
రోజ్మేరీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోజ్‌మేరీ టీ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.

రోజ్‌మేరీ టీ తాగటం వల్ల శ్వాస సమస్యలకు దూరంగా ఉండడానికి ఇది చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చలికాలంలో రోజ్ మేరీ టీ తాగితే మూడ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెంటల్ క్లారిటీ కూడా వస్తుంది. యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పనిచేస్తుంది.

రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. ఎముకలు, కండరాల నొప్పుల నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. రోజ్‌మేరీ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. ఈ మూలిక యాంటీ ఇన్ల్ఫమేటరీ , యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది, ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. మెదడు పనితీరు కూడా బాగుంటుంది. మెదడు చురుగ్గా పననిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. ముడతలు పడడం వంటి బాధలు కూడా ఉండవు.

రోజ్మేరీలో కార్నోసోల్ పుష్కలంగా ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించే ఫైటోకెమికల్ కలిగి ఉంటుంది. రోజ్మేరీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని కురులకు ఉపయోగించడం వల్ల అందమైన కురులని పొందవచ్చు. జుట్టు బాగా ఎదుగుతుంది. బలంగా, దృఢంగా ఉంటుంది.