
ఎన్నో పోషకాలు దాగున్న బార్లీని చాలా మంది నిపుణులు గరిబోళ్ల సంజీవని అంటారు.. ఆయుర్వేదంలో దీనిని అద్భుతమైన ఔషధంగా పేర్కొంటారు.. బార్లీ నీటిని ఉదయాన్నే రెగ్యులర్‌గా తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఇది హైడ్రేషన్, జీర్ణక్రియకు సహాయపడుతుంది.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ (డిటాక్సిఫై) చేయడానికి సహాయపడుతుంది. బార్లీ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఫైబర్ – యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉన్న బార్లీ నీరు.. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలు, గ్యాస్, గుండెల్లో మంట, మలబద్ధకం లాంటి పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

మూత్రపిండాలు క్లీన్ అవుతాయి: బార్లీ నీటిని తాగడం వల్ల శరీరం నుండి అన్ని హానికరమైన పదార్థాలు తొలగిపోతాయి.. దీంతో శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాకుండా బార్లీ మూత్రపిండాలలో హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా నిరోధించడంతోపాటు.. రాళ్లు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గుతుంది: బరువు తగ్గడానికి బార్లీ నీటిని క్రమం తప్పకుండా తాగవచ్చు. బార్లీ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బార్లీనీరు డీహైడ్రేషన్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

రక్తపోటును అదుపులో ఉంచి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: అధిక రక్తపోటుతో బాధపడే వారు బార్లీ నీటిని తాగవచ్చు. బార్లీ నీరు అధిక రక్తపోటును అదుపులో ఉంచి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ రోగులకు మేలు: బార్లీలో అధిక ఫైబర్ ఉండటం వల్ల.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కావున ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికోసం.. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా బార్లీ గింజలు నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం, ఆ నీటిని మరిగించి, ఆ తర్వాత త్రాగాలి.. పొడి కూడా నీటిలో వేసి మరిగించి తాగవచ్చు..