Almonds For Face : బాదంతో అందం..! ఇలా వాడితే మీ ముఖ సౌంద‌ర్య‌మే మారిపోతుంది.. తప్పక ట్రై చేయండి..

| Edited By: TV9 Telugu

Sep 09, 2024 | 3:04 PM

Almonds For Face : బాదంలో ఉండే గుణాల గురించి మనందరికీ తెలిసిందే. బాదంపప్పు తినటం బలాన్ని, తెలివిని పెంచుతుంది. బాదం పౌడర్ చర్మాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా కొన్ని వారాల్లో మీరు కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాగలదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.! బాదం పొడిని కొన్ని రకాలుగా చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ కణాలు ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా మారుతాయి. ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముడతలను తొలగిస్తుంది. మీ అసలు వయస్సు కంటే 10 సంవత్సరాలు చిన్నవారిగా కనిపించేలా చేస్తుంది. యవ్వనంగా మారాలంటే బాదం పొడిని ఎలా వాడాలి..? ముఖానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం రండి.

1 / 5
బాదంపప్పును ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు. బాదంపప్పులో విటమిన్ ఎ, విటమిన్ బి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని పోషించి అందంగా మారుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును ఉపయోగించడం ద్వారా, మీరు మీ ముఖం నుండి ముడతలు, మొటిమలు, మచ్చలను తొలగించవచ్చు.

2 / 5
బాదం పలు రకాలుగా ముఖానికి ఉపయోగపడుతుంది. ముందుగా రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకుని చేతులతో తేలికపాటి మసాజ్ చేయాలి. మీరు కావాలంటే బాదం నూనెలో కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉదయం నిద్రలేచి, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో ఫలితాలను చూస్తారు.

3 / 5
బాదంపప్పును మెత్తగా గ్రైండ్ చేసి అందులో పాలు లేదా రోజ్ వాటర్ వేసి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. క్రమ తప్పకుండా ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ ముఖంలో మార్పును చూస్తారు.

4 / 5
మరో పద్ధతిలో మూడు, నాలుగు బాదంపప్పులను తీసుకుని రాత్రిపూట పాలలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే పాలలోని బాదంపప్పును తీసి తిని పాలు తాగాలి. కావాలంటే బాదంపాల‌ను కూడా తయారుచేసుకుని తాగవచ్చు. ఇందుకోసం బాదంపప్పును మిక్సీలో గ్రైండ్ చేసి, పాలతో కలిపి గ్యాస్‌పై మరిగించాలి. మీరు బాదం, పెరుగుతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

5 / 5
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదంపప్పు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే బాదంపప్పును రోజూ తీసుకోవాలి