
వాము ఆకులతో తయారుచేసిన టీ తాగడం వల్ల సులభంగా గ్యాస్టిక్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. వాము ఆకులతో చేసిన టీ ఉదయాన్నే తాగితే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకుల టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వాము ఆకులలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాపర్, కాల్షియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు ఉంటాయి. అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వాము ఆకుల టీ తయారీ కోసం ముందుగా వాము ఆకులను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. వాము ఆకులను శుభ్రం చేసుకున్న తర్వాత నీటిని మరిగించుకొని అందులో వేయండి. వేసిన తర్వాత మూడు నిమిషాలు మరిగించి గాజు గ్లాసులో వడకట్టుకోండి. గాజు గ్లాస్‌లో వడకట్టుకున్న తర్వాత తగినంత తేనె వేసుకుని గాలి కడుపుతో తాగితే గ్యాస్టిక్ సమస్య సులభంగా మాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Ajwain Leaves

ఆహారం తర్వాత కొన్ని ఆకులను నమలడం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మంచి నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా వాము ఆకులను ఉపయోగించవచ్చు. ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

కొన్ని అజ్వైన్ ఆకులు, విత్తనాలను నీటిలో ఉడకబెట్టాలి. ఈ ద్రవాన్ని వడకట్టి చల్లబరిచి ఆ నీటితో జుట్టును తడపాలి. ఇది మీ జుట్టు మూలాలను బలంగా చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది మీ జుట్టుకు మెరుపు మరియు సిల్కీనెస్ ఇస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌ల నుండి దూరం చేస్తుంది.