Weight Lose Tips: త్వరగా బరువు తగ్గాలంటే తప్పక తినాల్సిన కూరగాయలివే.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..?

|

Sep 10, 2023 | 3:38 PM

Weight Lose Tips: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య అధిక బరువు లేదా ఊభకాయం. ఈ సమస్య నుంచి బయట పడేందుకు కొందరు నానా ప్రయత్నాలతో వృథా ఖర్చులు పెట్టుకుంటున్నారు. అయితే అలాంటి వారు బరువు తగ్గడానికి ఆహారంపై శ్రద్ధ వహిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి మేలు కలుగుతుందని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునేవారు ఏయే కూరగాయలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1 / 5
బ్రోకలీ: బ్రోకలీలోని ఫైబర్, కెరోటినాయిడ్స్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా.. కేలరీలు తక్కువగా ఉన్నందున బ్రోకలీతో బరువు పెరిగే ప్రమాదం కూడా లేదు.

2 / 5
క్యాబేజీ: క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఫైబర్ బరువు తగ్గడంలోనే కాక జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

3 / 5
బచ్చలికూర: బచ్చలికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కంటిచూపు పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఇందులోని ఫైబర్ కంటెంట్ మీ శరీరంలోని అధిక కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గేలా చేస్తుంది.

4 / 5
క్యాప్సికమ్: క్యాప్సికమ్‌లోని పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ పోషకాలతో పాటు క్యాప్సైసిన్ అనే జీవక్రియను మెరుగుపరిచే సమ్మేళనం ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది.

5 / 5
కాలీఫ్లవర్: ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలను కలిగిన కాలీఫ్లవర్‌ శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక ప్రాత్ర పోషిస్తుంది. కాలీఫ్లవర్‌లో వాటర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉన్నందున శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.