Fiber Deficiency: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫైబర్ ఫుడ్స్ తినాల్సిందే.. లేదంటే గుండెను ప్రమాదంలో పడేసినట్లే..

Updated on: Sep 22, 2023 | 1:05 PM

Fiber Deficiency: అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ క్రమంలో తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేడ్స్ వంటి పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే అహారాలను తీసుకోవడం మరీ ముఖ్యం. ఎందుకంటే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి అన్ని రకాల వ్యర్థాలను శరీరం నుంచి తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫైబర్ లోపం శరీరంలో ఏర్పడితే గుండెకు కూడా ప్రమాదమే. అయితే శరీరంలో ఫైబర్ లోపాన్ని ఎలా గుర్తించాలి..? తెలుసుకుందాం..

1 / 5
మలబద్ధకం: శరీరంలో ఫైబర్ లోపం ఉంటే మీకు కలిగే మొదటి సమస్య మలబద్ధకం. ఈ లక్షణం కనిపించిన వెంటనే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకుంటే కడుపులో గ్యాస్, అసిడిటీ, మంట సమస్యలు ఎదురవుతాయి. మలబద్ధకం సమస్యను నివారించకుంటే పైల్స్ సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది.

2 / 5
చెడు కొలెస్ట్రాల్: ఫైబర్ లేకపోవడం వల్ల శరీరానికి ఎదురయ్యే మరో సమస్య కొలెస్ట్రాల్. ఫైబర్ లోపం కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి రక్తనాళాలను అడ్డంకిగా మారతాయి. ఫలితంగా బీపీ, గుండెపోటు సమస్యలు పెరుగుతాయి. అంటే ఫైబర్ లోపం ఏర్పడితే గుండె ప్రమాదంలో పడినట్లే.

3 / 5
అలసట: జీర్ణవ్యవస్థపై పెరిగిన భారం కారణంగా ఆహారం జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కాకుంటే శరీర భాగాలను శక్తి లభించక వెంటనే మీరు అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడతారు.

4 / 5
బరువు పెరగడం: శరీరంలో ఫైబర్ లేకపోవడం జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు, తీసుకున్న ఆహారంలో ఎక్కడికక్కడే పేరుకుపోయి బరువు, లావు పెరుగుతారు.

5 / 5
కాబట్టి నిత్యం తినే ఆహారంలో కూరగాయలు, ఆకూకూరలు, దుంపలు, పండ్లు వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్‌తో పాటు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.