పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే చర్మం కూడా మెరిసిపోతుంది. అందుకోసం మీరు నిత్యం కొన్ని ఆహారాలను తీసుకోవాలి.
క్యారెట్: చర్మానికి మేలు చేసే ఆహారాల్లో క్యారెట్ కూడా ప్రముఖమైనది. దీనిలోని పోషకాలు చర్మ సమస్యలను తగ్గించడంలో పనిచేస్తాయి. దీన్ని మీరు నేరుగానే తీసుకోవచ్చు.
దోసకాయ: నిత్యం తీసుకునే ఆహారంలో దోసకాయ ఉంటే చర్మ సమస్యలు మీ దరికే చేరవు. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున మీ చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
కొబ్బరి నీరు: కొబ్బరినీరులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో పనిచేస్తుండగా.. విటమిన్ ఇ చర్మ, కేశ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
నిమ్మకాయ: చర్మ సమస్యలను నివారించడంలో నిమ్మకాయకు ప్రముఖ స్థానం ఉంది. దీనిలోని విటమిన్ సి, విటమిన్ ఇ చర్మం మెరిసేలా చేయడంతో పాటు మొటిమలు, మచ్చలను తొలగిస్తాయి.