పేదింటి పులావ్ ముందు ఏ బిర్యానీలు పనికిరావు.. 60 ల్లో కూడా తాతలు ఫిట్‌గా ఉన్నారంటే సీక్రెట్ ఇదే!

Updated on: Jun 09, 2026 | 8:36 AM

పాత రోజుల్లో మన తాతలు ఇలా చేసుకుని తినే వాళ్ళు అందుకే ఇప్పటికి వాళ్లు ఎంతో బలంగా ఉన్నారు ఇంకా దీనిలో పచ్చిమిర్చి కూడా వేయడం వలన దీనిలో ఉండే ఘాటు అనారోగ్య సమస్యలను తరిమికొట్టేది. ఇంకా ఇది పలావ్‌కు మంచి రుచిని కూడా అందిస్తుంది. చాలా తక్కువ సమయంలో చేసుకుని తినొచ్చు.

1 / 5
మష్రూమ్ - పచ్చిమిర్చి పలావ్ కు  కావలసిన పదార్థాలు :  ఒక కప్పు బాస్మతి బియ్యం,  200 గ్రాముల మష్రూమ్స్ , 10 పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  10 పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , ఒక దాల్చిన చెక్క , 4 లవంగాలు , రెండు యాలకులు , నాలుగు బిర్యానీ ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి.

2 / 5

మష్రూమ్ - పచ్చిమిర్చి పలావ్ తయారీ విధానం: ముందుగా  బియ్యాన్ని బాగా  కడిగి 20 నిమిషాల పాటు వీటిని బాగా  నానబెట్టి ఆ తరవాత ఈ నీరు వంపేయాలి. అలాగే  పచ్చిమిర్చి, పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీరను తీసుకుని కొద్దిగా నీరు పోసి దానిని మెత్తగా మిక్సీ పట్టుకుని  దీనిని పేస్ట్ మాదిరి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5

పలావ్ తయారీ విధానం :  ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయినా తరవాత 
దీనిలో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, రెండు యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి  దీనిని బాగా వేయించాలి. కొద్దీ సేపు ఆగిన తరవాత కట్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయ ముక్కలు కూడా  వేసి గోల్డ్ కలర్లోకి మారే   వరకు వీటిని  వేయించాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు స్టవ్ మీదే ఉంచిన బాగా కలపాలి.

పలావ్ తయారీ విధానం : ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయినా తరవాత దీనిలో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, రెండు యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దీనిని బాగా వేయించాలి. కొద్దీ సేపు ఆగిన తరవాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని వేయించాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు స్టవ్ మీదే ఉంచిన బాగా కలపాలి.

4 / 5
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కనీసం 5  నిమిషాలు పాటు బాగా  వేయించాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న  పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇంకో 4 నిమిషాలు కలుపుతూ బాగా వేయించాలి. ఇక చివరిగా దీనిలో  నానబెట్టిన బియ్యం కూడా  వేసి బాగా కలపాలి.  ఇంకా దీనిలో రుచికి సరిపడా  ఉప్పు, తగినన్ని నీరు కూడా  పోసి బాగా కలపాలి.  అన్ని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి. చివర్లో నిమ్మరసం కూడా చల్లి పలావ్‌ను కలిపి కిందకు దించుకోవడమే.

5 / 5

మష్రూమ్స్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. పాత రోజుల్లో మన తాతలు ఇలా చేసుకుని తినే వాళ్ళు అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతో బలంగా ఉన్నారు ఇంకా దీనిలో పచ్చిమిర్చి కూడా వేయడం వలన దీనిలో ఉండే  ఘాటు అనారోగ్య సమస్యలను తరిమికొట్టేది. ఇంకా ఇది  పలావ్‌కు మంచి రుచిని కూడా అందిస్తుంది. చాలా తక్కువ సమయంలో చేసుకుని తినొచ్చు.

Follow Us