
మూడు ఆకులతో కలిగి ఉండే ఈ మారేడు దళాలు అంటే ఆ బోళా శంకరుడికి మహా ఇష్టం.అందుకే శివ పూజలో పూలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మారేడు ఆకులు ఉంటాయి. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, కోరిన కోర్కెలను త్వరగా నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అలాంటి మారేడు మనిషి ఆరోగ్యానికి దివ్యౌషధం వంటిది.

మారేడు పండునే బిల్వ పండు అని కూడా అంటారు. బిల్వ వృక్షం ఆకులు, పండ్లు ఆ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి. బిల్వ ఆకులు… మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. అంతేకాదు, బిల్వ ఆకులు, పండ్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు… ఒంట్లో వేడి పోతుంది. బిల్వ పండ్లు, ఆకుల నిండా యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కూడా చాలా ఉంటాయి. విటమిన్ A, C, రైబోఫ్లావిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ B1, B6, B12 పుష్కలంగా ఉంటాయి.

మన శరీరంలో వాత, పిత్త, కఫ సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఏది తేడా వచ్చినా మనం నీరసించిపోతాం. బిల్వ పత్రాలు, పండ్లు… ఈ మూడింటినీ సరిచేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బిల్వ పండ్లు, ఆకుల నిండా యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు ఉంటాయి.

బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

జీర్ణ ప్రక్రియ సరిగా జరగనివారికి బిల్వ పండు మేలు చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా మారి… రిలాక్స్ ఫీల్ పొందుతారు.

మారేడు పండు రసాన్ని తాగితే… ఎండాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. వేసవికి దీన్ని కూల్ డ్రింక్‌గా చెబుతారు. మారేడు పండులో గుజ్జు బయటకు తీసి మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయొచ్చు. కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కాస్త పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది.

మారేడు పండు రసాన్ని తాగితే… ఎండాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. వేసవికి దీన్ని కూల్ డ్రింక్‌గా చెబుతారు. మారేడు పండులో గుజ్జు బయటకు తీసి మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయొచ్చు. కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కాస్త పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది.

అలాగే గ్లాస్ వాటర్‌లో మారేడు ఆకులను వేసి మరిగించి వడబోసుకోవాలి.ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా తాటి బెల్లం మరియు స్వచ్ఛమైన తేనె కలిపి తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.మరియు శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు పోయి అవయవాలన్నీ శుభ్ర పడతాయి.