
చర్మానికి హైడ్రేషన్ కవచం: చియా గింజలకు నీటిని పీల్చుకునే గుణం చాలా ఎక్కువ. ఇవి తమ బరువు కంటే 10-12 రెట్లు ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలవు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం లోపల హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా, తేమతో మెరుస్తూ కనిపిస్తుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నిధి: ఆరోగ్యకరమైన చర్మానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. చియా గింజల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పరిచి, బయటి కాలుష్యం నుంచి కాపాడటమే కాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.

యాంటీ ఆక్సిడెంట్లతో యవ్వనంగా: చియా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించి, ముఖంపై సహజమైన మెరుపును తీసుకొస్తుంది.

కొల్లాజెన్ : చర్మం బిగుతుగా ఉండటానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ ముఖ్యం. చియా గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా చర్మం సాగకుండా, యవ్వనంగా కనిపిస్తుంది.

లోపలి నుండి శుభ్రం: జీర్ణక్రియ బాగుంటేనే ముఖం వెలుగుతుంది అనేది అక్షర సత్యం. చియా గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. శరీరం లోపల వ్యర్థాలు తొలగిపోతే, ఆ ప్రభావం నేరుగా చర్మంపై కనిపిస్తుంది.

వాపులు, మొటిమల నియంత్రణ: చియా గింజలకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై వచ్చే ఎరుపు, వాపు, మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.